prabhutva sahayam

పత్రికా ప్రకటన 


*అర్హులైన ప్రతీ పేదవారికి ప్రభుత్వ సహాయం 


*కోవిడ్ - 19 కీలక సమాచారాన్ని అందిస్తున్న మీడియా 


*గిరిజన గ్రామాల్లో కోవిడ్-19 పై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న 


రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 


విశాఖపట్నం, ఏప్రిల్, 8:


అర్హులైన ప్రతీ ఒక్క పేదవారికి ప్రభుత్వ సహాయం అందుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 


కోవిడ్-19 కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు మీడియా అందిస్తుందన్నారు. 


అనంతరం విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ప్రింట్ మరియు ఎలక్ర్టానిక్ మీడియా వారికి నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు.


ఈ సమావేశంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 


అనంతరం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో గిరిజన గ్రామాల్లో మంత్రి పర్యటించి కరోన నివారణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఆయన గిజనుల్లో అవగాహన కల్పించారు.  


గిరిజన సమస్యలను గూర్చి ఆయన అడిగి తెలుసుకున్నారు. 


అనంతరం నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. 


అనంతరం జీవీఎంసీ 6వ వార్డు బక్కన్నపాలెం, రావేళ్ళపాలెం లో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 నివారణ లోను, సమాచారం ను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో మీడియా కీలకపాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. 


పెద్ద ఎత్తున  నిత్యావసర వస్తువులు, బియ్యం, పప్పుధాన్యలు, ఉల్లిపాయలు,కూరగాయలు , 1500 వందలకు పైగా  నాణ్యమైన ఆహార ప్యాకెట్లను రాష్ట్ర గౌరవ పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పంపిణీ చేశారు.


కష్ట సమయంలో ప్రభుత్వ అందరికీ చేదోడు వాదోడుగా సహాయ, సహకారాలు అందించడం మంచి నిర్ణయమన్నారు.


ప్రజా సంక్షేమం లో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, కరోన సంక్షోభ సమయంలో కూడా ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి సహాయ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు ఆయన వివరించారు.


కరోన నియంత్రణ పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు  తెలిపారు.


ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలు పాటించి కరోన మహమ్మారిని తరిమి కొట్టేందుకు సహకరించాలని ఆయన కోరారు. 


కోవిడ్-19 నివారణ కు లాక్ డౌన్ కారణంగా రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా,  లాక్ డౌన్ కాలంలో నిరుపేదలు ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న  నిర్ణయంతో పేదలకు సహాయం చేసినట్లు ఆయన వివరించారు. 


అర్హులైన ప్రతీ ఒక్కరికి తెల్లరేషన్ కార్డ్ లబ్దిదారులకు బియ్యం, పప్పులు అందించడం జరుగుతుందన్నారు. 


ఈ 4వ తేదీ నుండి పేదలకు లాక్ డౌన్ సమయంలో ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం వేయి రూపాయల చొప్పున పంపిణీ చేసినట్లు చెప్పారు. 


ప్రతి వాలింటర్లు ఇంటింటికీ వెళ్లి వేయి రూపాయలు అందచేయటంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు.


లాక్ డౌన్ సమయంలో పేదవారికి సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 


రాజకీయాలకు అతితంగా ఎలాంటి భేదాలు లేకుండా  ఉచితంగా రేషన్, 1000 రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నా మని చెప్పారు.


కరోన వైరస్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక ప్రజలు కు వివరించారు. 


లాక్ డౌన్ సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు.  


అనంతరం మంత్రి పెద్ద ఎత్తున నిత్యవసర సరుకులను పేదలకు అందజేశారు. 


ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము, తదితరులు పాల్గొన్నారు.


జారీ ఉప సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ విశాఖపట్నం.