పత్రికా ప్రకటన ... విశాఖపట్నం ... ఏప్రిల్.. 8
అనంతపురం, కడప, తూర్పు గోదావరి తదితర జిల్లాల నుండి సరఫరా అవుతున్న అరటిపండ్ల కు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే అమ్మకాలు చేపట్టాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మార్కెటింగు, ఉద్యాన, వ్యవసాయ, జీవీఎంసీ , మెప్మా శాఖల అధికారులతో పాటు నగరంలో గల హోల్సేల్ డీలర్ సభ్యులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల నుండి సరఫరా అవుతున్న అరటిపండ్లను నిర్దేశించిన స్టాక్ పాయింట్లలో దించి వాటికి నిర్దిష్ట ధరను నిర్ణయించి జీవీఎంసీ పరిధిలో గల అన్ని జోన్ లలో తో పాటు నర్సి పట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీ లలో అమ్మకాలు చేయాలన్నారు. అరటి పళ్ళు త్వరగా పాడైపోయే అవకాశం ఉన్నందున మొబైల్ వ్యాన్ ల ద్వారా అమ్మకాలు చేపట్టాలన్నారు. అధిక మొత్తంలో లోడు వస్తున్నందున చిన్న ట్రక్కుల ద్వారా సరఫరా చేసేందుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
జీవీఎంసీ యు సి డి పి డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర పరిధిలో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం లో అరటి పండ్ల స్టాక్ ను దించడం జరుగుతున్నదని, వాటిని 8 జోన్లకు సరఫరా చేసి అమ్మకాలు చేస్తున్నామన్నారు. మెప్మా పిడి సరోజినీ మాట్లాడుతూ నర్సీపట్నం యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో మొబైల్ వ్యాన్ ల ద్వారా అమ్మకాలు పెట్టడం జరుగుతుందన్నారు. డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ డి ఆర్ డి ఏ కు సంబంధించిన కోఆర్డినేటర్లు, ఇతర సిబ్బందితో అమ్మకాలు చేస్తున్నామన్నారు. ఉద్యాన శాఖ ఏడి శైలజ మాట్లాడుతూ రావులపాలెం మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి అరటి పళ్ళ దిగుబడి అధికంగా వస్తున్నదని అవి నిల్వ ఉండవని, త్వరగా అమ్మకాలు చేయాలని లేనిపక్షంలో పాడైపోయే అవకాశం ఉందన్నారు.
హోల్సేల్ డీలర్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు మాట్లాడుతూ కూరగాయలు , అరటి పళ్ళు అమ్మకాలను చేపడుతున్నామని, ముఖ్యంగా కాన్వెంట్ జంక్షన్ లో అధిక సంఖ్యలో లో డ్లు దిగుతాయని అక్కడ హమాలీలు పనిచేస్తున్న సిబ్బంది కి సంబంధించి ట్రాన్స్పోర్టు , హెల్త్ విషయంలో సహాయ సహకారాలు అందించాలన్నారు . శానిటేషన్ సక్రమంగా లేదని, మాస్క్ లను , శానిటైజర్లను పంపిణీ చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా కూరగాయలు , అరటిపళ్ళు లోడ్లతో వెళ్లే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారని, కాబట్టి హమాలీలకు , సిబ్బందికి, రవాణా వాహనాలకు గుర్తింపు కార్డులను ఇవ్వాల్సిందిగా కోరారు.
జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ నగర పోలీస్ కమిషనర్ తో మాట్లాడి వాణిజ్య రవాణా వాహనాలకు ఆటంకం కలుగకుండా పర్మిషన్ తీసుకుంటామన్నారు. అదేవిధంగా గుర్తింపు కార్డులను కూడా మంజూరు చేస్తామన్నారు. కూరగాయల మార్కెట్ ల వద్ద శానిటేషన్, బ్లీచింగ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు.
ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ ఏ డీ కాళేశ్వరరావు ,వ్యవసాయశాఖ జెడి లీలావతి, డిఆర్డిఏ పిడి విశ్వేశ్వరరావు , యు సి డి పి డి శ్రీనివాస్ , మెప్మా పిడి సరోజినీ, ఉద్యాన శాఖ ఏడి శైలజ , డీలర్ల సంఘం సభ్యులు తదితరులు హాజరయ్యారు.
..........................................................
జారీ .. డివిజనల్ పౌరసంబంధాల అధికారి, నర్సీపట్నం.