ఎలమంచిలి సబ్ జైలు సిబ్బంది డ్యూటీ లోనే మద్యం సేవిస్తూ ఖాళీ చేసిన మద్యం సీసాలను జైలు ఆవరణలోనే పడేస్తున్నా జైలు సూపరింటెండెంట్ పట్టించుకోవడంలేదు. ఇంకా జైలు ఆవరణలోనే సిబ్బంది బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. సబ్ ట్రెజరీ, తహసీల్దార్ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లు అన్నీ కలిసి వున్న క్యాంపస్ లో జైలు సిబ్బంది ఇలా చేయడము వలన పగిలిపోయిన ఖాళీ సీసాలలో చేరిన నిలువ నీటి వలన దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, బహిరంగ మలవిసర్జన చేయడం వలన దుర్గంధం రావడంతో మిగిలిన ఆఫీస్ లలో పని చేస్తున్న సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ దుశ్చర్యలకు పాల్పడిన జైలు సిబ్బంది పై క్రమశిక్షణ చర్యలు తీసుకొనవలసినదిగా పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. వారి నిర్వాకం పై ఫోటోలో చూడవచ్చు.
yelamanchili jaila bar