revenue sevalu

యూనిఫామ్ ధరించని...,  కంటికి కనపడని ...,  తెర వెనుక ఉండి..,  మొత్తం గమనిస్తూ..., అవసరం మేరకు తగిన చర్యలు తీసుకుంటూ...,  అన్ని ప్రభుత్వ శాఖలనూ సమన్వయం చేసుకుంటూ...,  రేయింబవళ్లు కుటుంబ సంక్షేమాన్ని సైతం త్యాగం చేసి.., ప్రజలకు క్రమశిక్షణతో నిస్వార్ధ సేవ చేసేవారే జిల్లా కలెక్టర్ మొదలుకొని గ్రామ రెవిన్యూ సహాయకుని వరకూ విస్తరించిన రెవెన్యూ యంత్రాంగం ....!


శాంతి భద్రతలు అదుపులో ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం దగ్గర నుండి..,ఈ విపత్కర పరిస్థితిలో  ప్రతీ పేద కుటుంబం ఆకలి తీర్చడానికి నిత్యావసర సరుకులు గ్రామ గ్రామానికి తరలించి గడప గడపకూ అందించేది  రెవిన్యూ ఉద్యోగులు...!


వ్యాపారులు స్వార్ధానికి పోయి ధరలు పెంచి/కృత్రిమ కొరత సృష్టించి...  ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే..,  EC యాక్ట్ ప్రయోగం ద్వారా కొరడా ఝుళిపించి న్యాయమైన ధరలకు ప్రజలకు సరుకులు అందేలా చూసేది రెవిన్యూ ఉద్యోగులు... ! 


 ప్రాణాలను సైతం పణంగా పెట్టి.., విదేశాలనుండి వచ్చి ఎక్కడెక్కడో వున్న వైరస్ బాధితుల్ని కనిపెట్టి.., వైద్య,  పోలీస్ ఇంకా అవసరమైన శాఖలన్నింటినీ సమన్వయ పరచి అవసరమైతే వారిని చికిత్స కేంద్రాలకు తరలిస్తున్నది.. రెవిన్యూ ఉద్యోగులు... !


ఇంకొక పెద్ద విషయం ఏమిటంటే..,  దేశం మొత్తం లాక్ డౌన్ లో వున్న ఈ తరుణంలో బస్సులు,  రైళ్లు మరి ఏ ఇతర రవాణా మార్గాలూ అందుబాటులో లేని ఈ సమయంలో సొంత వాహనాల్లో సొంత డబ్బులు వెచ్చించి ప్రజలకు సేవ చేస్తున్నది రెవిన్యూ ఉద్యోగులు... ! 


రెవెన్యూ యంత్రాంగం సేవలను గుర్తించి సెల్యూట్ చేయవలసిన తరుణం ఇది... 🙇‍♂️