*🙏ప్రజలలో కొందరికి విజ్ఞప్తి...!!!*
స్కూల్స్ కి కాలేజెస్ కి సెలవలు ప్రకటించింది మన ప్రభుత్వం,
దేనికోసం?
ఇంట్లోనే ఉండి చదువుకోమని మన ఇల్లు మరియు మన పరిసరాలు శుభ్రంగా వుంచుకోమని బయటకు రావటం మంచిది కాదని,
కానీ కొంత మంది జనాలు అవేవో హాలిడేస్ లా ఫీల్ అవుతూ బంధువుల ఇళ్ళకి ఊర్లకి ప్రయాణం అవుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం.
చదువుకుని సిటీలో వుండే మీరే ఇలా ప్రవర్తిస్తే రేపు ఊహించినట్టే ఈ వైరస్ ప్రబలిపోతే దానికి బాధ్యత ఎవరిదీ? కచ్చితంగా ప్రభుత్వానిది కాదు ప్రజలదే.
దయచేసి విజ్ఞులుగా బాధ్యతగల పౌరులుగా మెలగండి,ఎవరింట్లో వాళ్ళు వుండండి. అవసరానికి తప్ప సరదాలకు బయట తిరక్కండి.
ఇంకొక నెల రోజుల్లో చైనా కరోనా రహిత దేశం కాబోతుంది ఎలా జరగబోతుంది ఈ అద్భుతం చైనా ప్రభుత్వం మాత్రమే కాదు ఆ దేశ ప్రజలు ప్రభుత్వ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించడం వలన...
మన అదృష్టం మన దేశం ఇప్పుడు రెండవ దశలోనే ఉంది మన నిర్లక్ష్యం వలన మూడవ దశలోకి వెళ్తే ఆ పాపం కచ్చితంగా మనదే అవుతుంది.
మన ప్రభుత్వాలు చెప్పినట్టు నడుచుకుందాం ప్రతి వ్యక్తి ఒక బాధ్యతగల పౌరుడు గా ఉందాం. మన దేశ గౌరవాన్ని మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకొందాం...
క్రమశిక్షణ తో ఉందాం
కలసికట్టుగా విజయం సాధిద్దాం, Facebook లో Whatsaap లో వచ్చే పనికిరాని సత్యదూరమైన వదంతులు నమ్మకండి.
ఇది అందరిని ఉద్దేశించి వ్రాస్తున్నది కాదు
కేవలం కొంతమంది అవగాహనలేమితో చేస్తున్న పనులవల్ల
అందరం ఇబ్బందిపడతాం