prajalaku dhairyanni ivvali

ఏపీలో కరోనా ఎఫెక్ట్ అన్నీ బంద్
అమరావతి : కరోనావైరస్‌(కోవిడ్‌-19)నివారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 


ఇప్పటికే విద్యాసంస్థలకు బంద్‌ ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా సినిమా థియేటర్లు, మాల్స్‌, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌ సెంటర్లు, ఇండోర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 


పెద్ద దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూ దర్శనాలు నిలిపేయాలని నిర్ణయం తీసుకుంది. 


కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసున్నారు.


అలాగే వైద్యం పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులైన వైద్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 


ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి కానీ..భయన్ని కాదని ఈ సందర్భంగా సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. 


పెద్ద సంఖ్యలో గుమిగూడే జాతరలు మానుకుంటే మంచిదని, శుభకార్యాలు వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలని కోరారు. ప్రజారవాణాలో ఉన్న వాహనాలు శుభ్రతను పాటించాలన్నారు. 


ఎక్కువ మందిని బస్సులో ఎక్కించుకోవద్దని సూచించారు. 


మార్చి 31 వరకు ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.