పత్రికా ప్రకటన తేది : 28.03.2020
దేశం ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబాలను వదిలి ప్రజల భద్రత, రక్షణ కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా గత పది రోజులుగా కరోనా వైరస్ నుండి ప్రజలను అప్రమత్తం చేస్తూ 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలపడంతో పాటు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాకినాడ ఓడరేవు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్. కె.వి.రావు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50,000 మంది పోలీస్ సిబ్బందికి కరోనా వైరస్ నుండి రక్షణ లో భాగంగా 30 లక్షల రూపాయల విలువైన సామాగ్రి లక్ష మాస్క్ లు, లక్ష గ్లాజ్ లు మరియు వ్యక్తి గత రక్షణ దుస్తులను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులైన శ్రీ. గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారికి అందజేయడం జరిగింది. వీటన్నిటినీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు, పోలీసు ఉన్నతాధికారులు అడిషనల్ డి.జి రవి శంకర్ అయ్యనార్, పీ & ఎల్ ఐ.జీ నాగేంద్ర కుమార్, డి.ఐ.జి పాలరాజు, డి.ఐ.జి రాజశేఖర్ బాబు ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌతం సవాంగ్ గారు పోలీసు సిబ్బంది మరింత బాధ్యతతో సమర్థవంతంగా ప్రజాసేవకు పునరంకితం అవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు.