police lu andaru station lo vundali

రేపు పోలీసులందరూ స్టేషన్లలో అందుబాటులో ఉండాలి   
* అత్యవసర సేవలకు పోలీసులు సంసిద్ధం కావాలి 
* పోలీస్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ 
* ఏపీ డీజీపీ గౌత‌మ్‌ సవాంగ్ 
అమ‌రావ‌తి: దేశవ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం ద్వారా మద్దతు తెలపాలని, జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించి కరోనా వైరస్‌ను జయించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు పోలీసులందరూ స్టేషన్లలోనే అందుబాటులో ఉండాలని, అత్యవసర సేవలు అందించేందుకు సంసిద్ధులై ఉండాలని డీజీపీ స్పష్టం చేశారు. జనతా కర్ఫ్యూ పరిస్థితులను పోలీస్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, డయల్ 100 ద్వారా సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.