*21–03–2020*
*అమరావతి*
*ముఖ్యమంత్రి ఆదేశాలతో కదంతొక్కిన అధికార యంత్రాంగం*
*నివారణ చర్యలతో కోవిడ్ – 19పై యుద్ధం*
*జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్, టాస్క్‌ఫోర్స్‌కమిటీలు*
*ఆస్పత్రుల్లో మంత్రులు , కలెక్టర్లు, అధికారులు, తనిఖీలు*
*కోవిడ్–19ను ఎదుర్కోవడానికి వైద్యసదుపాయాల కల్పనపై ఆరా*
*గ్రామ, వార్డు స్థాయి వరకూ చురుగ్గా కార్యక్రమాలు*
*సర్వే, పర్యవేక్షణ, చర్యలు, ప్రచారం .. కోణాల్లో యంత్రాంగం ముందడుగు*
*అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు*
*ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్న వైనం, వ్యాధి లక్షణాలు కనిపిస్తే తదుపరి చర్యలు*
*విశాఖలో కోవిడ్ –19 పాజిటివ్ కేసు వెలుగుచూసిన ఇంటికి 3 కి.మీ పరిధిలో పూర్తిస్థాయి సర్వే*
*335 బృందాలతో 25,950 ఇళ్ల సర్వే, కరోనా లక్షణాలతో ఎవ్వరూ లేరని ప్రాథమికంగా గుర్తింపు*
*నెల్లూరులో పూర్తి కోలుకున్న కరోనా బాధితుడు, ఫలితాలు రాగానే విడుదల*
*ఒంగోలులో పరిస్థితిని సమీక్షించిన ఆరోగ్యశాఖమంత్రి, మంత్రులు*
*ఇతర జిల్లాల్లోనూ మంత్రుల పర్యవేక్షణ*
*జనతా కర్ఫ్యూ పాటించడంపై పూర్తిస్థాయి సన్నద్ధత*
*రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వర్తక, వ్యాపార, వాణిజ్య సహా ఇతర సంస్థలు*
అమరావతి: ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రంగాం కదంతొక్కింది. గత కొన్నిరోజులగా అప్రమత్తంగానే ఉంటూ చర్యలు చేపట్టిన ప్రభుత్వం, మరింత వేగంగా ముందుకు కదిలింది. కోవిడ్ –19 (కరోనా వైరస్) నివారణ చర్యలను ముమ్మరంగా చేపట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ప్రతి జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్, టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, కలెక్టర్లు నుంచి డివిజన్, మండల స్థాయి అధికారులు వైరస్ నివారణపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గ్రామస్థాయి వరకూ కూడా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంపై కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై సన్నద్ధం చేశారు. ప్రతి ఇంటికీ సర్వే చేయడం, కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ఇంట్లోనే ఐసోలేషన్‌లో పెట్టడం, అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలించడం, విదేశాలనుంచి వచ్చిన వారిపై పర్యవేక్షణ, రోజూ వారి ఆరోగ్య వివరాలను నమోదు, వివరాల ప్రకారం వైద్యాధికారులు ఇచ్చిన సూచనలను అమలు చేయడం, అవగాహన కలిగించేలా ప్రచారం నిర్వహించడం అనే కోణాల్లో గ్రామస్థాయి వరకూ యంత్రాంగం ముమ్మరంగా పనిచేస్తోంది. ఈ ప్రక్రియలో వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని విధంగా యాభై ఇళ్లకో వాలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఇంటినీ సర్వే చేయడం, జల్లెపడపట్టి వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఒకవేళ ఉంటే వారిని గుర్తించడంలో, వారికి వైద్య సూచనలు అందించడంలో అత్యంత ప్రభావంతంగా పనిచేస్తున్నారు. విశాఖలో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి కోలుకుంటున్నారు. అంతేకాదు.. ఆయన ఉన్న ఇంటికి 3 కి.మీ పరిధిలో పూర్తిస్థాయి సర్వే నిర్వహించారు. 335 బృందాలతో 25,950 ఇళ్లరు సర్వే చేశారు. కరోనా లక్షణాలతో ఎవ్వరూ లేరని ప్రాథమికంగా గుర్తించారు. అయినా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ఆ ప్రాంతంపై వైద్య ఆరోగ్యశాఖ పూర్తి పర్యవేక్షణ ఉంచింది.నెల్లూరులో కరోనా పాజిటివ్‌గా తేలినవ్యక్తి... పూర్తిగా కోలుకున్నాడు. శాంపిల్స్ పంపించామని, పరీక్ష పలితాలు రాగానే ఇంటికి పంపిస్తామని అధికారులు ప్రకటించారు. ఒంగోలులో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్‌లు అధికారులతో సమీక్షనిర్వహించారు. ఇతర జిల్లాల్లోనూ మంత్రులు పర్యవేక్షణ చేస్తున్నారు. రేపటి జనతా కర్ఫ్యూ పాటించడంపైనా కలెక్టర్లు అన్ని రకాల సంస్థలతో సమావేశం అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. జిల్లాల వారీగా ఉన్న వివరాలు ఇవి.
శ్రీకాకుళం:
ఆస్పత్రుల్లో కలెక్టర్ ఇ.నివాస్ తనిఖీలు. అన్నిరకాలుగా సిద్ధమయ్యారా? లేదా? అన్నదానిపై క్షుణ్నంగా తనిఖీలు.
స్వయం సహాయక సంఘాల మహిళలతో కలెక్టర్ సమావేశాలు
కరోనా నిరోధానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు.
262 మంది విదేశాలనుంచి వచ్చిన వారి గుర్తింపు. 14 రోజుల పాటుహోం ఐసోలేషన్.
ఇంటింటికీ సర్వే. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వాలంటీర్ల ద్వారా సర్వే.
విదేశాలనుంచి వస్తే కంట్రోల్‌రూంకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు.
ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన యజమానులు, డాక్టర్లతో సమావేశాలు.
కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో జాయినా అయినా వెంటనే కంట్రోల్ రూంకు తెలియజేయాలని ఆదేశాలు.
జనతా కర్ఫ్యూకు సిద్ధం కావాలని పిలుపు.
నాగార్జున కెమికల్స్ లిమిటెడ్ వాళ్లు హైపోక్లోరైడ్ సొల్యూషన్ వేయి లీటర్లు ఇచ్చారు.
విజయనగరం:
ఆశావర్కర్లు, వాలంటీర్ల ద్వారా సర్వే. విదేశాలనుంచి వచ్చిన వారి గుర్తింపు.
విదేశాలనంచి వచ్చిన వారిలో 66 మంది సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
కరోనా లక్షణాలతో ఉన్న వ్యక్తి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఒకరు ఉన్నారు. కరోనా నెగెటివ్ వచ్చింది. టాంజానియా నుంచి వచ్చారు. వైరస్ లేకపోయినా ముందు జాగ్రత్తతో ఆస్పత్రిలోనే ఉంచారు.
స్వచ్ఛంద, వ్యాపార సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, ఛాంబర్‌ఆఫ్‌కామర్స్ తదితర సంస్థలో కలెక్టర్ సమావేశం.
సామాజిక దూరం పాటించడంపై ఈ సమావేశం ఏర్పాటు.
జనతా కర్ఫ్యూ పాటించడంపైనా సమావేశంలో చర్చ.
జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులు ఏవిధంగా ఉన్నాయన్న దానిపై తనిఖీలు.
మండల స్థాయిలో ఉన్న ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపరుచుకోవాలని ఆదేశాలు.
విదేశాలనుంచి వచ్చిన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు.
నెదర్లాండ్స్ నుంచి వచ్చిన 5 గురికి హోటల్లోనే ఐసోలేషన్. వారికి అక్కడే వైద్య సేవలు .
కంట్రోల్ రూం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి నేరుగా సలహాలు, సూచనలు, వారికి వైద్య సేవలు అందించడంపై కంట్రోల్ రూంద్వారా దృష్టి.
విశాఖపట్నం:
ఒక పాజిటివ్ కేసు ఉంది. సౌదీ నుంచి వచ్చారు.
చెస్ట్‌ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వయస్సు 65 సంవత్సరాలు.
అతడున్న ఇంటికి 3. కి.మీ పరిధిలో వైద్య సిబ్బంది పర్యవేక్షణ.
ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరూ 163 టీమ్స్, మధ్యాహ్నం నుంఇచ 172 టీమ్స్.. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి సర్వే చేశారు.
25,950 గృహాలను సర్వే చేశారు.
జలుగు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారిని పరిశీలించారు.
14 మంది చెస్ట్ ఆస్పత్రిలో చేరితో ఒకటి పాజిటివ్. 13 రిపోర్టులు రావాల్సి ఉంది.
కలెక్టర్, మంత్రి అవంతి శ్రీనివాసరావు కంటిన్యూస్‌గా రివ్యూలు.
మంత్రి అవంతి శ్రీనివాస్.. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
జిల్లా స్థాయిలో 20 కమిటీలు ఏర్పాటు .
కమిటీలందరి సభ్యులతో ఉడా చిల్డ్రన్స్ థియేటర్‌లో సమావేశం. తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష.
జనతా కర్ఫ్యూ అమలు చేయడానికి చర్యలు.
తూర్పుగోదావరి :
కరోనా లక్షణాలతో ఉన్నవారికి ఎలా ట్రీట్‌చేయాలి? వారికి ఎలా వైద్యం చేయాలన్నదానిపై ఇప్పటికే డెమో చేశారు.
వైజాగ్‌లో పాజిటివ్ తేలిన వ్యక్తి.. వయా రాజమండ్రి, సామర్లకోట మీదుగా రైల్లో విశాఖపట్నం వెళ్లారు.
సంబంధిత కోచ్‌లో ఎవరైనా జిల్లాకు సంబంధించిన వ్యక్తులపై ఆరా.
మండల స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్‌లు. పారిశుద్ధ్యంపై దృష్టి.
అమలాపురంలో దక్షిణ కొరియా నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చింది.
రాజమండ్రి వద్ద బొమ్మూరులో ముందస్తుగా 125 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు.
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు.
వార్డు వాలంటీర్లు, ఆశావర్కర్లతో సర్వే.
పశ్చిమగోదావరి:
కలెక్టరేట్‌లో పనిచేస్తున్న కంట్రోల్ రూం. జేసీ–2 ఇన్‌ఛార్జి
ఇంటింటి సర్వే.. వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్ల ద్వారా పూర్తి.
టాస్క్‌ఫోర్స్ కూడా ఇవాళ సమావేశమయ్యింది. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు. ఆర్డీఓలు కూడా ఈ మీటింగులో పాల్గొన్నారు.
సాండర్ట్‌ఆపరేషన్ ప్రొజీసర్‌ను వివరించిన కలెక్టర్.
విదేశాలనుంచి వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. వారికి 18 రోజులు, 28 రోజులు కూడా పూర్తయ్యాయి. ఎవ్వరికీ కూడా లక్షణాలు లేవు.
నాలుగు టెస్టుల్లో మూడు నెగెటివ్. ఇంకో టెస్టు ఫలితాలకోసం చూస్తున్న అ«ధికారులు.
ఐసోలేషన్‌లో ఉన్నవారిని వైద్య సిబ్బంది ఎన్నిసార్లు పర్యవేక్షిస్తున్నారు? వారికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు అన్నదానిపై నిరంతర సమీక్ష.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఐసోలేషన్ వార్డులకోసం ప్రత్యేక భవనాల గుర్తింపు.
జనతా కర్ఫ్యూ కోసం సమీక్ష.
కృష్ణా:
మండలస్థాయి అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్ సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు, ఆదేశాలు.
జనతా కర్ఫ్యూ పాటించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష.
గ్రామ, గ్రామాన, పట్టణాల్లో ప్రజలకు ప్రకటనలు.
విజయవాడ రైల్వే స్టేషన్‌లో హైజీన్ కండిషన్స్‌పై కలెక్టర్ పర్యవేక్షణ
విజయవాడ నగరంలో జనతా కర్ఫ్యూపై సంబంధిత అధికారులపై సమీక్ష .
జిల్లాలో పూర్తి సర్వే, విదేశాలనుంచి వచ్చిన వారిపై దృష్టి.
గుంటూరు :
జిల్లా అధికారులు, పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖసిబ్బందిపై కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ సమీక్ష సమావేశాలు.
మున్సిపల్ అధికారులు, తహశీల్దారులతో కూడాసమీక్ష .
జనతా కర్ఫ్యూపై సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్.
రేపటికి సరిపడా నిత్యవసర వస్తువులు తీసుకోవాలని ప్రజలకు సూచనలు.
విదేశాలనుంచి వచ్చిన వారిని పూర్తిగా గుర్తించిన అ«ధికారులు
ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వాలంటీర్ల సర్వేద్వారా గుర్తింపు.
వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
వైద్య సిబ్బంది అబ్జర్వేషన్‌లోనే వీరంతా.
కంట్రోల్ రూం జిల్లా వైద్యారోగ్యశాఖకార్యాలయంలో ఉంచారు.
ఏ సమాచారం వచ్చినా రెస్పాండ్ అవుతున్నారు.
జిల్లా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ పెట్టారు. జాయంట్ కలెక్టర్‌ను టాస్క్‌ఫోర్స్ కన్వీనర్‌గా పెట్టారు. దినేశ్‌కుమార్ నేతృత్వం.
విదేశాలనుంచి వచ్చిన వారిని మానిటరింగ్ చేస్తూ..వారు బయటకు వెళ్లకుండా చూస్తున్నారు.
జనతా కర్ఫ్యూలో పాల్గొనేందుకు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా తాగునీరు సరిపడా ముందస్తుగానే ఇచ్చారు.
నిత్యావసర వస్తువల ధరలపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా:
ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు. కరోనా సోకిన వ్యక్తి కోలుకుంటున్నారు.
పాజిటివ్ కేసు ఉన్న వ్యక్తి ఇంటికి 3. కి.మీ పరిధిలో సర్వేచేశారు.
అనుమానం ఉన్న వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు.
అనుమానిత వ్యక్తులకు 14 రోజులు కంప్లీట్ ఐసోలేషన్ అయ్యింది. 5 గురిని తిరిగి ఇంటికి పంపించారు.
వైద్య అధికారులు సూచనలు కచ్చితంగా పాటించాలని గట్టిగా చెప్పిన అధికారులు.
ఇవాళ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని, మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్‌సమీక్ష సమావేశాలు.
కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష.
జిల్లా వైద్యారోగ్యశాఖ కంట్రోల్ రూంలో పనితీరును సమీక్షించారు.
కంట్రోల్‌రూంలో డేటాను పరిశీలించిన ఆరోగ్యశాఖ మంత్రి.
నెల్లూరు జిల్లా:
నెల్లూరులో పాజిటివ్ కేసు 14 రోజులు అయ్యింది. పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని తేల్చిన అధికారులు. పరీక్షలు కోసం మళ్లీ పంపారు. నివేదిక రాగానే పంపించడానికి ఏర్పాట్లు.
12 మంది ఐసోలేషన్‌లో ఉంచారు. వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.
మంత్రి అనిల్ అధికారులతో సమీక్షా సమావేశాలు.
నివారణ చర్యలు, శానిటేషన్ చేస్తున్నారు.
విదేశాలనుంచి వచ్చిన వారిని పూర్తిగా అబ్జర్వేషన్‌లో ఉంచారు. అనుమానం ఉన్నవారిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. వీరిపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ.
వీరిని రోజూ కలుస్తున్న వైద్య సిబ్బంది. రోజూ ఆరోగ్య పరిస్థితిపై ఆరా.
పాజిటివ్ కేసు ఉన్న ఇంటికి 3 కి.మీ. పరిధిలో పూర్తి సర్వే చేశారు.
చిత్తూరు జిల్లా:
యూకే, స్పెయిన్, ఇటలీ, సౌదీ నుంచి విదేశీయులు వచ్చారు.
ముగ్గురికి వ్యాధి లక్షణాలు ఉంటే.. వారికి పరీక్షలు నిర్వహిస్తే.. నెగెటివ్ వచ్చింది.
జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు. 163 ఫోన్‌కాల్స్‌వచ్చాయి.
జిల్లా మొత్తం మాక్ డ్రిల్ చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్‌ఆఫీసర్.
పాజిటివ్ కేసు వస్తే..ఎలా వ్యహరించాలి?ఎలాంటి విధానాలు పాటించాలన్నదానిపై ప్రత్యేక శిక్షణ.
14 నియోజకవర్గాలకు 14 మంది ప్రత్యేక అధికారులు.
సర్వే టీం, సర్వైలైన్స్ టీం, రీసెర్చ్ మొబలైజేషన్ టీమ్స్ ఉన్నాయి.
వీరికి ఎంపీడీఓలు, ఎమ్మార్వోలు, మెడికల్ టీమ్స్‌సపోర్టుగా ఉంటారు.
ఏఎన్‌ఎం, ఆశా, వాలంటీర్లు కూడా విదేశాలనుంచి వచ్చే వారిపై పూర్తిస్థాయి సర్వే.
వీరు గుర్తించిన అంశాలపై వెంటనే చర్యలు.
పంచాయతీకి కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత గ్రామ సెక్రటరీకి అప్పగింత.
మదనపల్లె, పలమనేరు, తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఐసోలేషన్ వార్డులు.
క్వారంటైన్ కోసం పద్మావతి నిలయం సిద్ధం.
హోటళ్లు, మెడికల్, మటన్ షాపులు ఇతర వర్తక వ్యాపార సంఘాలతో సమావేశం. పూర్తి స్థాయిలో జనతా కర్ఫ్యూ పాటించడానికిఏర్పాట్లు.
తిరుమల, తిరుపతి దేవస్థానాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేత.
అనంతపురం:
విదేశాలనుంచి వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచాలని ఐసోలేషన్ నోటీసులు జారీచేశారు.
విదేశాలనుంచి వచ్చే వారిపై పూర్తి వైద్య సిబ్బంది పర్యవేక్షణ.
జిల్లాస్థాయిలో అధికారులతో నిరంతర సమీక్ష
32 మంది అధికారులతో సమన్వయ కమిటీ.
18 టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు.
సిద్ధమవుతున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి. 45 రూమ్స్ నిర్మాణం. 2 రోజుల్లో పూర్తకావొస్తున్న పనులు. యుద్ధప్రాతిపదికన నిర్మాణం.
కడప:
జనతా కర్ఫ్యూపై సమీక్ష.
అధికారులతో సమీక్షించిన కలెక్టర్.
అన్ని సంఘాలు, వ్యాపార సంస్థలతో సమావేశం.
ప్రజల్లో అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహించిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.
13 కమిటీలు జిల్లాస్థాయిలో ఏర్పాటు. మండల స్థాయిల్లో కూడా కమిటీలు ఏర్పాటు.
లక్షణాలు ఉన్నవారిని హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు.
28 రోజులు çహోంఐసోలేషన్ పూర్తిచేసుకున్నవారు 356 మంది.
ముందు జాగ్రత్తగా 2094 స్వచ్ఛందంగా హోంఐసోలేషన్‌లో ఉన్నారు.
విదేశాలనుంచి వచ్చిన 45 మందిపై పూర్తి నిఘా.
జిల్లాలో కాల్‌సెంటర్ ఏర్పాటు.
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో కాల్‌సెంటర్.
ప్రభుత్వ కార్యాలయాలవద్ద శానిటైజర్ల ఏర్పాటు.
అవసరం ఉంటేనే కార్యాలయాలకు రమ్మని ఆదేశాలు.
కర్నూలు :
కర్నూలులో ప్రచారం ముమ్మరం
జిల్లా వ్యాపార, వర్తక సంఘాలు.. ఇతర సంఘాలతో కలెక్టర్ సమావేశం.
జనతా కర్ఫ్యూ పాటించడంపై సమావేశం.
18 టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు
ప్రతిరోజూ ఈ కమిటీలతో సమావేశం.
ఒక్కో రంగంపై ఒక్కో కమిటీ. ప్రతిరోజూ రివ్యూ
కంట్రోల్ రూం ఏర్పాటు. నోడల్ అధికారి నేతృత్వంలో.
24 గంటలు పనిచేసే కాల్‌సెంటర్ కూడా ఏర్పాటు
నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు ఇలా.. కీలక ప్రాంతాల్లో.. ఐసోలేషన్ ఏర్పాటు.
విదేశాలనుంచి వచ్చే వారిపై పర్యవేక్షణ.
కర్నూలుకు సమీపంలో క్వారంటైన్ ఏర్పాటు చేయడానికి, 100 పడకలు సిద్ధంచేయడానికి సన్నాహాలు.
గ్రామాల స్థాయి నుంచి కమాండ్ కంట్రోల్ రూంకు నిరంతరం కాల్స్.