*AP GOVERNMENT సూచనలు 👇*
1) రైతు బజార్, కిరాణా షాపులు, మటన్ షాప్ లు, చికెన్ షాప్ లు ..., ఇవి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే తెరిచి ఉంచాలి.
2) పాలు మరియు పెరుగు సంబంధిత పదార్థాలకు చెందిన షాపులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉండును.
3) మెడికల్ షాపులు 24 గంటలు తెరిచి ఉండును.
4)👉👉 *ముఖ్య గమనిక* 👉👉 షాపులు ఓపెన్ చేయాలి అంటే సంబంధిత షాపు ఓనర్ లు తమ షాపు ముందర ఒక మీటరు, మీటరు దూరంలో సున్నంతో బాక్స్ టైపు లో మార్కింగ్ వేయాలి. ఆ మార్కింగ్ లలో మాత్రమే క్యూ లైను మెయింటెన్ చేయవలెను అట్టి షాపులు మాత్రమే ఓపెన్ చేయుటకు అనుమతి కలదు. లేనియెడల షాపు తెరుచుటకు అనుమతి లేదు. ఒకవేళ మార్కింగ్ లేకుండా మరియు గుంపులు గుంపులుగా షాపు నందు జనం గుమిగూడి ఉండినచో సదరు షాపు మూసి వేయబడును.
5) ఉదయము మరియు సాయంత్రం వేళల్లో వాకర్స్ వాకింగ్ చేయుటకు అనుమతి లేదు.
6) దేవాలయాలు మసీదులు చర్చిలకు ఎవరు కూడా ప్రార్థనల నిమిత్తం వెళ్ళరాదు. వారు ఇళ్లలోనే ఉండి తమ ప్రార్థనలు చేసుకొనవలెను.
7) తోపుడు బండ్లు మరియు మార్కెట్లలో ఉన్న షాపులకు షాపులకు మధ్య కచ్చితంగా 10 అడుగుల దూరం పాటించవలెను. లేనియెడల క్రిమినల్ కేసులకు గురి అవుతారు.
8) నిత్యవసర వస్తువులను తెచ్చుటకు ఇంటికి ఒకరికి మాత్రమే బయటికి వచ్చుటకు అనుమతి కలదు, మరియు మీ ఇంటికి దగ్గరగా ఉన్న షాపు నందు మాత్రమే మీరు సరుకులు తెచ్చుకొనుటకు అనుమతి కలదు. ఇంటికి దూరంగా ఉన్న షాపులకు వెళ్ళుటకు అనుమతి నిరాకరించడం అయినది.
9) ప్రతి ఒక్కరూ తమ తమ వాహనాలను చాలా తక్కువగా అనగా అతి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే వాడవలెను. అలాగు లేనియెడల వాహనములు సీజ్ చేయబడును.
10) అనవసరంగా సరదా గా మరియు చిల్లర చిల్లర గా రోడ్లమీద అ వాహనాల్లో తిరగడం పూర్తిగా నిషేధించబడినది అట్లు కనబడిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయబడును.
*11)👉👉 పై సూచనలను ప్రతి ఒక్క సిబ్బంది తమ తమ వాట్సాప్ గ్రూప్ నందు ఉన్నటువంటి మీడియా సోదరులకు మరియు మీ ఇతర వాట్సాప్ గ్రూపు లకు తెలియపరచి వారిని కరోనా వైరస్ గురించి చైతన్య పరచగలరు అని సూచించడమైనది* ..