bhartha pai bharya case

*కరోనా లేదని తేలితేనే కాపురం*.. 


*భర్తపై పోలీస్ కేసు పెట్టిన భార్య.*


కరోనా కల్లోలం కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతోంది. అయితే ప్రజలు దీనిపై పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారనడానికి ఇలాంటి ఘటనలు ఉదాహరణగా కూడా భావించ వచ్చు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ గ్రామంలో నివాసం ఉండే ఓ వ్యక్తి.. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో లారీ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. కరోనా నేపథ్యంలో అతను ఇంటికి తిరిగొచ్చాడు. అయితే భార్య తమతోపాటు భర్త కలసి ఉండటానికి ఒప్పుకోలేదు. కరోనా వ్యాధి నిర్థారణ పరీక్ష చేయించుకున్న తర్వాతే ఇంట్లోకి రానిస్తానని తెగేసి చెప్పింది, పిల్లలకు వైరస్ సోకితే ప్రమాదమని భర్తకు చెప్పింది. అతను వినకపోడంతో.. చివరకు ఆదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి, అధికారుల సాయంతో క్వారంటైన్ కేంద్రానికి పంపించారు.