కరోనాపై పోరుకు ఆర్మీ ‘ఆపరేషన్ నమస్తే’!@@kg
దిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటానికి భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. ఈ పోరాటంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ప్రకటించారు. ‘ఆపరేషన్ నమస్తే’ పేరుతో కొవిడ్-19కు వ్యతిరేకంగా జరిగే పోరులో తాము భాగస్వాములౌతామని వెల్లడించారు. గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని..ఈ ఆపరేషన్‌లో కూడా తాము తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎనిమిది క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
army operation