అల వైకుంఠపురములో..
శ్రీదేవి : కంగారు.. కంగారుగా... స్వామి.. స్వామి..
శ్రీనివాసుడు : ఏమిటీ దేవి.. ఎందుకు అంత కంగారు..
శ్రీదేవి : స్వామి.. ఏమిటీ ఇది.. మన కొండ.. తిరుమల కొండకు భక్తులను అనుమతించకపోవడం.. కొండ ఖాళీ చేయడం.. ఆలయం మూసివేయడం.. ఏమిటీ..
శ్రీనివాసుడు : భక్తులకు నా పైన భక్తి కన్నా.. ఆ వ్యాధి పైన భయం ఎక్కువగా ఉంది (చిన్నగా నవ్వుతూ)...
భూదేవి : ఆ... ఆ... తిరుచానూర్ ఆలయం కూడా మూసేశారు..
శ్రీనివాసుడు : పాపం భక్తులకు ఇది పరీక్షా..
అన్నమయ్య : స్వామి... స్వామి... నా ఉత్సవాలు కూడా ఆపేశారు..
శ్రీనివాసుడు : ఉండవయ్యా... ప్రభుత్వాలు, అధికారులు.. మాకే నామాలు పెట్టారు.. నువ్వు పాడు మేము వింటాము.. ఐనా నీ పాట పైన మక్కువ ఉన్నవారు ఎక్కడైనా పాడుతారులే... (ప్రశాంతంగా చెప్పాడు...)
శ్రీదేవి, భూదేవి : అది కాదు స్వామి...!
శ్రీనివాసుడు : దేవి... మనకు కూడా ఏకాంతం దొరికి చాలా యుగాలు అయ్యింది కదా..ఇలా అయినా.. సమయం దొరికింది..
వకుళామాత: నాయన.. శ్రీను.. నా చేతితో వెన్న పెట్టి ఎన్ని సంవత్సరాలు అయ్యింది.. రా.. తిను..
స్వామి : అవును.. అమ్మ.. మాకు కూడా సమయం ఇచ్చింది.. ఈ వ్యాధి.. (నవ్వుతూ)
హతీరాంజీ: స్వామి.. మీకు ఇప్పుడు చాలా సమయం ఉంది కదా.. కాసేపు పాచికలు ఆడుదామా...
స్వామి : లేదు.. హతీరాంజీ... ఇప్పుడు... నా పాచికలు ఏమి పని చేయడం లేదు.. కేవలం.. అధికారులది, ప్రభుత్వoది... ముఖ్యంగా భజనపరుల పాచికలేపారుతున్నాయి..
నారదుడు : నారాయణ.. నారాయణ.. ఏమిటీ స్వామి.. నేను విన్నది... మరి మార్గం ఏమిటి.. స్వామి..
స్వామి : నారదా.. ప్రస్తుతం చెడుదే "రాజ్యం".. మంచి రోజులు ముందు ఉన్నాయి.. అందరు జాగ్రత్తగా ఉండాలి.. చెడు ఎక్కువ రోజులు ఉండదు.. అందరూ "పసుపు ", ఎక్కువగా వాడండి.. పసుపు వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శార్వారీనామ సంవత్సర ఉగాది నుంచి చాలా బాగుంటుంది. నా నామ సంకీర్తనం చేయండి. అంతా నేను చూసుకుంటాను. శుభం భూయాత్...✋🏻
ala vaikuntapuram