హజరత్ నిజాముద్దీన్ నుంచి తిరుపతి వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్సప్రెస్ లో భోగి నెంబర్ 9 లో ప్రయాణించిన 11 మంది ఇండోనేషియా వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఆ బోగీలో ప్రయాణించిన వారి వివరాలు ఇవ్వమని రైల్వే శాఖను కోరింది. తెలంగాణ లో దిగిన వారిని గుర్తించి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన పని అది.
మరి రైలు తిరుపతి చేరుకుంది 9 బోగీలో ప్రయాణించిన ఆంధ్ర వారు ఎంతమంది ఎక్కి దిగి ఉంటారు.
ఇది చాలా సీరియస్ మాటర్ బోగీలో మొత్తం 72 సీట్లు అందులో 11 మంది ఢిల్లీ నుంచి రామగుండం వరకు ప్రయాణించారు. వారిలో ఏడుగురికి పాజిటివ్. ట్రైన్ రన్నింగ్ లో ఎంతోమంది ఎక్కి దిగి ఉంటారు అది పగటి పూట ప్రయాణించే రైలు కాబట్టి ఎన్ని వేల మంది ఎవరో తెలియదు దాని గమ్యస్థానం తిరుపతి. తెలంగాణలో రామగుండం లో దిగిన వారి గురించి తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
మరి ఆ తర్వాత ఆంధ్రా లో ప్రయాణించిన రైలు ఎంతమంది ఎక్కడం దిగడం చేసి ఉంటారు.
కనీసం అందులో ప్రయాణిస్తున్న ఆంధ్రా కు చెందిన వ్యక్తులను గుర్తించడానికి కూడా మన ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదు.
వారి కోసం ఇంత వరకు ట్రై చేసే ప్రయత్నం చేయలేదు. ఎంత అజాగ్రత్త ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఈ జాగ్రత్తలు తీసుకోండి అని మొత్తుకుంటున్నారు.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఎన్ని వేల మందికి ఇది సంక్రమిస్తుంది అనే ఆలోచన ముందు జాగ్రత్త కూడా లేకపోవడం విషాదం.హజరత్ నిజాముద్దీన్
హజరత్ నిజాముద్దీన్