ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు వైద్యకళాశాలలు
అమరాతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా పాడేరులో, గుంటూర్ జిల్లా గురజాలలో, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్యకళాశాలలకు అనుమతి vhఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది.
20/03/2020